JD Vance: గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులు కాలేరు..! 1 y ago
అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్ లే నిర్ణయిస్తారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. గ్రీన్ కార్డు ఉంటే యూఎస్ లో ఉండటానికి నిరవధిక హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని వీడటం, ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించకపోతే గ్రీన్ కార్డును రద్దు చేయొచ్చని అమెరికా చట్టాలలో వివరణ ఉందని జేడీ వాన్స్ వెల్లడించారు.